(Cpm పట్టణ కమిటీ సభ్యులు బిట్ల గణేష్ విమర్శ )
Trs ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులకు వ్యతిరేఖంగా పనిచేస్తుంటే దానికి పల్లా రాజేశ్వరరెడ్డి వత్తాసు పలుకుతూ చెప్పేవన్నీ దొంగ లెక్కలేనని Cpm పట్టణ కమిటీ సభ్యులు బిట్ల గణేష్ విమర్శించారు.
దివి: 02-03-2021 మంగళవారం రోజున Cpm పట్టణ కమిటీ ఆధ్వర్యంలో MLC ఎన్నికల ప్రచారంలో భాగంగా వామపక్షాలు బలపర్చిన పట్టభద్రుల MLC అభ్యర్థి జయసారధిరెడ్డి గెలుపును కాంక్షిస్తూ పట్టణంలోని కుర్మవాడలో పట్టభద్రుల ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈసందర్బంగా బిట్ల గణేష్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భర్తీ చేయకుండా, ఉద్యోగులకు PRC ఇవ్వకుండా, కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. కేంద్రంలోని Bjp ప్రభుత్వం ప్రభుత్వ రంగసంస్థలను మొత్తం ప్రవేటీకరణ చేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని అన్నారు. 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగులందరికి నిరుద్యోగభృతి ఇవ్వాలని, ప్రయివేటు లెక్చలర్లకు, టీచర్లకు కరోనా భృతి ఇవ్వాలని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకు, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పట్టభద్రుల MLC ఎన్నికల్లో వామపక్షాలు, ఉద్యోగులు, పట్టభద్రులు బలపర్చిన అభ్యర్థి జయసారధిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు బాల్నే వెంకటమల్లయ్య, Md.బుర్రానోద్దీన్, ఉప్పరి వేణు తదితరులు పాల్గొన్నారు.