u news mulugu

నిరాధారా ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత విలువలు ప్రతిష్ట ను కించ పర్చిన U న్యూస్ రిపోర్టర్ చిలుక ప్రవీణ్, మొగుళ్ళ భద్రయ్య పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి
దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలతో రా
కొంత మంది దుర్మార్గులు నా పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు
ములుగు ఎస్పీ శ్రీ సంగ్రమ్ సింగ్ జి పాటిల్ గారికి పిటిషన్ అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు జిల్లా ఎస్పీ శ్రీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ గారికి పిటిషన్ అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
చిలుక ప్రవీణ్,మొగుళ్ళ భద్రయ్య మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నా అవినీతి అక్రమాల గురించి కానీ అదే విధంగా భూ ఖబ్జా ల గురించి గానీ ఇతర ఏ విషయాలలో నేనే తప్పు చేసి ఉంటే ఏ శిక్ష కైన సిద్దం నా రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాడు కూడా ఒక్క తప్పు చేయలేదు చేసినట్లు నువ్వు నిరూపించాగలవా నీకు నిజంగా దమ్ము ధైర్యం ఒక అమ్మకు అబ్బకు పుట్టినోడివి అయితే రా ఎవరు నితి పరులు ఎవరో అవినీతి పరులో ఎవరో
తెలుస్తుంది నేను భూ ఖబ్జాలు చేసినట్లు నువ్వు నిరూపించే వ్యక్తిని అయితే రా నువ్వు నన్ను పిలిపించు పేదల పక్షాన నిత్యం అను నిత్యం ప్రజలకు ఏ కష్టం వచ్చిన వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటు ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజా జీవితం లో ఉన్న నా పై కొంత మంది దుర్మార్గులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని
పై U న్యూస్ యూట్యూబ్ చానల్ రిపోర్టర్ చిలుక ప్రవీణ్ తన చానల్ లో వీరిద్దరి పై తీవ్ర ఆరోపణ లు చేశారు.నన్ను ఖబ్జా కోరుగా చీత్రీకరిస్తూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు సబ్ రెజిస్ట్రార్ తస్లీమా కు సహకరిసున్నారని నిరాధారా ఆరోపణలు చేశారు.మహిళలు సమాజంలో గుర్తింపు ఉన్నవారని కూడా చూడకుండా అభ్యంతకరమైన హవ భావాలను ప్రదర్శిస్తూ కించపరిచేలా మాట్లాడారు.ఇది అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నా సామాజిక కార్యకర్తగా చెప్పుకునే మొగుళ్ళ భద్రయ్య అనే వ్యక్తి చిలుక ప్రవీణ్ కు తప్పుడు సమాచారం ఇచ్చి నా పై సబ్ రెజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ పై ఆరోపణలు చేయించడం జరిగింది.ఇట్టి సమాచారాన్ని యూట్యూబ్ చానల్ మరియు సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి.
పై విషయాలపై మీరు విచారణ జరిపి U న్యూస్ యూట్యూబ్ చానల్ రిపోర్టర్ చిలుక ప్రవీణ్ మొగుళ్ళ భద్రయ్య లపై చట్ట రీత్యా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోగలరని సీతక్క గారు పిటిషనలో పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెళ్లి రాజేందర్ గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్
ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,ములుగు మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా
చెన్నోజు సూర్య నారాయణ తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధి లు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.