YSR తెలంగాణ పార్టీకి భారత ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చిన సందర్భంగా YSRTP భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్ అమృతవర్శిని అనాధ- వృద్ధ ఆశ్రమంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు YSR అభిమానులకు శుభాకాంక్షలు తెలిపి అన్నదానం చేయడం జరిగింది. అనంతరం కిషన్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం పని చేస్తామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజా సమస్యలపై పుట్టిన పార్టీ అని ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్తామని ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న అధికార పార్టీలు TRS BJP విధానాలను ఎండగడతామని ఆయన అన్నారు త్వరలోనే జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లో మండల కమిటీ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని ఆయన అన్నారు జిల్లాలో YSRతెలంగాణ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రామకృష్ణ, మహేందర్, తిరుపతి, సుమన్, కిరణ్, నరేందర్, శ్రీనివాస్, ఖాజాబి, ఇక్బల్, చిరంజీవి, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.